టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్” అని కొనియాడారు. “తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి మన కేసీఆర్” అని ప్రశంసించారు.
“ఉద్యమ స్పూర్తితోనే బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న దేశం గర్వించదగ్గ పరిపాలన దక్షుడు మన కేసీఆర్” అని హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, ప్రజల ఇంటి పార్టీగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కేసీఆర్‌కు హరీశ్‌రావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.