mt_logo

కేసీఆర్ ఢిల్లీటూర్ ఖరారు

జనవరి 31న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 5నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఇప్పటికే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన అన్నిపార్టీల జాతీయనాయకులను ఫిబ్రవరి 1నుండి 6వతేదీ వరకు కలవనున్నారు. బిల్లు ఆమోదం పొందడానికి కేసీఆర్ తీవ్రస్థాయిలో కృషి చేయనున్నారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్, లోక్‌జనశక్తి అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ మొదలైన వారిని కలవడానికి అప్పాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. బిల్లులోని కొన్ని అంశాలపై సవరణలు సూచించిన డ్రాప్ట్‌ను టీఆర్ఎస్ నేతలు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి ఇవ్వనున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *