mt_logo

చంద్రబాబును ఉతికి ఆరేసిన కేసీఆర్

“చంద్రబాబుకు అధికారం పోయింది. మళ్లీ వచ్చే అవకాశం లేదు. టీఆర్‌ఎస్సే ఆయన్ను భూ స్థాపితం చేసింది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేసిండో చెప్పాలంటాడు. నేనేం చేసిన్నో దేశ ప్రజలకు తెలుసు. ప్రైమరీ స్కూల్ పిల్లగాడ్ని అడిగినా చెబుతడు. చంద్రబాబు లెక్క నేను ఏనాడూ లఫూట్ పనులు చేయలే. ఈ భూమ్మీద పుట్టినవాళ్లలో నీ అంత వికృతమనస్తత్వం ఉన్నోడు ఎక్కడాలేడు. మోసం, వికృతవాదం, దగా, వెన్నుపోటు, కుట్రలను కలిపితే చంద్రబాబు అనే అర్థం వస్తది. నీ బాగోతం దేశం మొత్తానికీ తెలుసు. నువ్వేదో ఎలుగపెట్టిన అంటున్నవు.
బిల్‌క్లింటన్ ఇండియాకు వచ్చినప్పుడు బిచ్చగాళ్లను దాచినవు. నీ తెలివి అర్థమైన క్లింటన్.. హైటెక్ సిటీలోనే నీ ముఖం మీద ఉమ్మినట్లుగానే మాట్లాడిండు. కియాస్కులు పెడుతా అని చంద్రబాబు అంటే ‘ముందు ప్రజలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు. నీ బొందకు కియాస్కులు పెడుతవా? ముందు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వు’ అని చెంప చెళ్లుమనిపించిపోయిండు. స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ వచ్చి ‘చంవూదబాబులాంటి వ్యక్తి మా దేశంలో ఉంటే అయితే పాగల్ దవాఖానలో వేస్తం.. లేకుంటే జైల్లో పెడుతం’ అన్నడు.

ఇవీ విదేశాల నుండి వచ్చి బాబుకు ఇచ్చిన కితాబులు. తెలంగాణకు బాగా ఊడపొడిసిన అంటుండు. అంగన్‌వాడీ టీచర్లను అసెంబ్లీ ముందట గుర్రాలతో తొక్కించినవు. కరెంటు చార్జీలు తగ్గించాలంటే బషీర్‌బాగ్‌లో రైతులను పిట్టలెక్క కాల్చి చంపించినవు. వందల మంది యువకులను ఎన్‌కౌంటర్ల పేరిట బలి తీసుకున్న రక్తపిపాసివి నువ్వు. దాన్ని అనుభవించినవు. తిరుపతిలో కొద్దిలో తప్పిపోయింది నీకు. నువ్వంత రక్తపిపాసివి కాబట్టి ఆ పరిస్థితి నీకు వచ్చింది. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. బహిరంగ చర్చకు సిద్ధమా? నేను రెడీ. ఏ రోజు ఎక్కడ్నో నువ్వే నిర్ణయించు. నీ చరిత్ర, నా చరిత్ర మొత్తం తీసుకుందాం. నేనేమో నమ్మిన సిద్ధాంతం కోసం కేంద్ర మంత్రి పదవిని గడ్డిపోచలా విసిరేసినా. అలాంటి కేసీఆర్‌ను పట్టుకుని, పదవి కోసం నీ మామకు వెన్నుపోటు పొడిచి ఆయన్ను చావకొట్టిన నువ్వా మాట్లాడేది? అవినీతికి మారుపేరు నువ్వు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక తెలంగాణలో నీ భార్య పేరుమీద, నీ పేరుమీద, లోకేష్‌పేరుమీద, నీ బినామీల పేరుమీదఎన్ని భూములున్నయో నీతోనే కక్కిస్తాం. ఎక్సైజ్ కుంభకోణం విచారణలో నీ పేరు కూడా వస్తే హైకోర్టుకుపోయి తప్పించుకున్నది నువ్వుకాదా? మీ చంద్రబాబు వచ్చి నాతో మాట్లాడిండని నీ పార్టీ ఎంపీలకు నిండు పార్లమెంట్‌లో చిదంబరమే స్పష్టంగా చెప్పిండు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయింది నువ్వు. అవిశ్వాస తీర్మానం పెట్టిననాడు సహకరించింది నువ్వు. ఇతరులతో కలిసిపోవడం, కుట్రలు చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య. మోసం, నయవంచన, దగా అనేది నువ్వు చేసుకుంటూ ఇతరుల మీద మాట్లాడుతావా? నువ్వేం చేసినవుఅంటున్నవు. నేను ఏనాడైనా ముఖ్యమంత్రిని అయిన్నా? ఉద్యమాన్ని చేపట్టిన. బాజాప్తా తెలంగాణ సాధిస్తున్నా. నీ బాధేంది? ‘నా అవినీతి సాగేదుండే. కేసీఆర్ జెయ్యంగా నా అధికారం పోయింది. మళ్లీ వచ్చేటట్లు కనిపిస్తలేదు’ అనేదే నీ బాధ. ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బహిరంగ చర్చకు వస్తాం. నీ చరిత్రేందో మొత్తం చెబుతా.

వ్యవసాయం చేసుకుంటున్నా… నీకేం అభ్యంతరం?

నేను ఫాం హౌస్‌ల పండుకుంటా అంటున్నాడు. నేను బరాబరి ఫాంహౌస్‌లనే పండుకుంటా. నాకు వ్యవసాయం ఉంది. నాకిష్టమైన వ్యవసాయం చేసుకుంట. నీకేం బాధోచ్చే? నేను నీలెక్క సింగపూర్ యాత్రలు చెయ్యకదా! నీలెక్క చీకటి సింగపూర్ యాత్రలు చేసి ఆస్తులు లెక్కపెట్టుకుని రానుకదా! నీకు అంత షోక్ ఉంటే దా చూపిస్త.. ఆడేం జరుగుతుందో. నీలాగా హైదారాబాద్‌లో ఉండి మందికి గోతులు తియ్య. చీకటి కుట్రలు చేసే అలవాటు నాకు లేదు. బాజాప్తా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి చెప్పి ఆమరణ దీక్ష చేసిన. నువ్వెందుకు దీక్ష చేసినవో నీకు తెల్వదు. నీకేమన్న దిమాక్ ఉన్నదా? నువ్వు చెప్పే సమన్యాయం ఏందో నీకు తెలుసా? ఒకసారి సమన్యాయం అంటవు.. ఒకసారి సమైక్యం అంటవు. అట్లాటోనివి తెలంగాణ ఇవ్వాలని ఎందుకు ఉత్తరం రాసినవు? ప్రణబ్‌కు లేఖ ఇచ్చింది మరిచిపోయినవా? యూటర్న్ తీసుకున్నది నువ్వుకాదా? నీ రంగు బయటపడగానే నిన్ను మట్టికరిపించలేదా? 12 ఎన్నికల్లో 12చోట్ల మట్టికరవలేదా? ఇంకా నీకు సిగ్గు, బుద్ధి రాలేదా? బాజాప్తా 14 సంవత్సరాల నుండి దేవాంతకుల నుండి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు రాజీలేని పోరాటం చేస్తున్నం.

నీలెక్క మాయోపాయాలు చేయలేదు. వ్యవసాయం దండగన్నావు. ప్రశ్నలడిగిన జర్నలిస్టులను మైండ్‌సెట్ మార్చుకొమ్మన్నవు. అట్ల చేసినందుకే కదా నిన్ను బండకేసి బాదింది! రైతులను దొంగల్లా చిత్రీకరించావు. జైళ్లలో పెట్టించినవు. వరంగల్ జిల్లాలో రైతు బిక్షపతి నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నడు. నకిలీ ఎన్‌కౌంటర్లతో రక్తం తాగింది నువ్వు కాదా? నువ్వు, వైఎస్ లక్షల కోట్ల విలువైన భూములను అమ్మేసిర్రు. మీ బండారం బయటపెడుతాం. ఏ ఒక్క స్కాంలోనైనా విచారణకు సిద్ధపడ్డవా? లోకాయుక్త పరిధిలోకి సీఎంను చేర్చాలని చర్చ వచ్చినప్పుడు అసెంబ్లీ నుండి పారిపోయినవు’ అని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *