mt_logo

లండన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేసీఆర్ మరియు తెరాస సపోర్టర్స్ అఫ్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టాహాసంగ జరిగాయి.

విదేశాల్లో మొట్టమొదటి సారిగా రాజకీయ పార్టీలకు అతీతంగా జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు వ్యవస్థాపకులు సిక్కా చంద్రశేఖర్ తెలిపారు.

ఏజ్ లింక్ అనే వృద్ద్దుల సేవా సంఘం, ఓపెన్ హార్ట్ సేవా సంఘంతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా NRI శాఖా మంత్రివర్యులు KT Rama Rao వారానికి ఒక రోజు చేనేత దరిస్తా అన్న స్ఫూర్తిగా మద్దతుగా సిరిసిల్ల నుండి ప్రత్యేకంగ తెప్పించిన వస్త్రాలను కోర్ కమిటీ సభ్యులు ధరించి #WearHandloom నినాదానికి మద్దతు తెలిపారు.

భాస్కర్ పిట్టల సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది వృద్ధులు పాల్గొన్నారు. మొదటితరం సబంధించిన హెస్టన్ కౌన్సిల్ర్స్ సిరిందెర్ పురేవాల్ పాల్గొన్నారు.

పాశ్చాత్య దేశాలలో వృద్ధులకు చాలా ఒంటరితనం ఉంటుందని వారికి మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, హైదరాబాద్ బిర్యానీ రుచిని మరియు తెలంగాణ వంటకాలను వృద్ధ ఆంగ్లేయులకు పరిచయం చేసినమని, ప్రతీ ఒక్కరు ఎంతో ఆనందించారని, కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపారని సంస్థ సభ్యులు సురేష్ గోపతి అన్నారు.

కేసీఆర్ జన్మదినం కేవలం జన్మదినం కాదు అది యావత్ తెలంగాణ పండుగ మరియు వారిని ఒక రాజకీయ నాయకునికంటే యువతకు మరియు మాలాంటి ప్రవాస భారతీయులకు ఒక స్ఫూర్తిదాయకం అని మరియు అందరికి అందుబాటు దృష్ట్యా ముందుగానే నిర్వహిస్తున్నట్లు కాసర్ల నగేష్ రెడ్డి మరియు వెంకట్ రంగు తెలిపారు.

కేసీఆర్ గారి కేకే కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా నిర్వహించాలని, వారి ఉద్యమ స్ఫూర్తి రాబోయే తరాలవారికి తెలియజేయాలనే ఒకే ఒక నినాదంతో ఈ వేడుకలు చేస్తున్నామని నరేష్ కుమార్ మరియు జయంత్ నార్పరాజు తెలిపారు.

అహింస మార్గాన 4 కోట్ల మందికి న్యాయం చేసిన వ్యక్తి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషమని ప్రముఖ సంఘ సేవకులు డాన్ జూన్సన్, తెలిపారు.

కార్యక్రమంలో ఏజ్ లింక్ సభ్యులు కేసీఆర్ గారికి జన్మదిన సందర్భంగ చేస్తున్నటువంటి ఈ స్వచ్చంద కార్యక్రమాలకు ఎంతో సంతోషించి తెరాస కండువాలు కప్పుకొని వారు జయధ్వానాలు ద్వారా వారి గౌరవం చాటారని ఈ సందర్భంగా ప్రమోద్ అంతటి, భాస్కర్ మోతీ తెలియయజేసినారు.

జన్మదిన సందర్భంగ తెలంగాణలో ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు, కాన్ఫరెన్స్ ద్వారా గోలి తిరుపతి తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన వృద్ధ సంఘ సేవకులుతో కలిపి కోర్ టీం సభ్యులు సంతోష్ ఆకుల, హరిబాబు గౌడ్ తో పాటు శిరీష చౌదరి, శ్రీలక్ష్మి నాగులబండి, రమాదేవి, జ్యోతి రెడ్డి, ప్రీతీ నోముల, వాణి అనుసరి, స్వప్న, అమీరహ్, గ్రాహం బేకర్, రిచర్డ్ సిషన్, డీన్ క్యారీ, సాలీ హౌగ్, అనిల్ పాండే, పార్థ ముడూర్ వాలంటీర్లుగా పనిచేసినవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *