స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన ఉండాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల స్థానికత నిర్ధారించడానికి ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు. కమిటీలో సభ్యులుగా హరీష్ రావు, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్ లను నియమించారు. ఉద్యోగుల స్థానికత, ఖాళీలకు సంబంధించి వివరాలను సేకరించడంలో టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది.
ఉద్యోగసంఘాల నేతలతో రేపు కేసీఆర్ సమావేశం కానున్నారు. సచివాలయంలో తమకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ కు వారు ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగుల విభజనపై తెలంగాణ ఉద్యోగులు 207 అభ్యంతరాలను ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో కేసీఆర్ ఉద్యోగసంఘాలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం కోసం కుందన్ బాగ్ లోని మంత్రుల క్వార్టర్స్ లో ఉన్న 3,4 బ్లాక్ లను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.