By: సవాల్ రెడ్డి
—
బ్రాండ్ అంబాసిడర్ బాంధవులు… బాధపడిపోవచ్చు కానీ…
మాకు మాత్రం…. చాలా ఆనందంగా ఉంది..
వచ్చిన తెలంగాణను అడ్డుకున్న కుట్రదారులు కంగారెత్తిపోతుంటే…
కట్టుకున్న కోటలు కళ్ల ముందే కుప్పకూలిపోతుంటే
పంచె సర్దుకుంటుంటే…
గోచీ పరిస్థితి చూస్తుంటే
వాహ్!
చూడ్డానికి రెండు కళ్లూ చాలట్లేదు…
కాళ్ల దగ్గర ఎస్ బాస్ గాళ్లు.. అన్యాయమంటూ ఆక్రోశిస్తుంటే…
ఎంత బాగుందో…
కసి తీరా ….. కరువు తీరా నవ్వాలనిపిస్తుంది…
ఎన్ని రోజుల తర్వాత ఈ ఆనందం…
—
యుద్దమంటే శత్రువును చంపడం కాదు…
వాడిని జయించడం… ఏదో సినిమాలో డైలాగు…
తెలంగాణ ద్రోహులను ఉరేసి చంపడంలో కాదు….
నడిరోడ్డు మీద ఒంటరిగా నిలబెట్టడంలోనే ఆనందం ఉంది.
బోయీలు వదిలేసిన పల్లకీని చేయడంలోనే గెలుపూ ఉంది.
దిక్కూ దివాణం లేకుండా చేసి పగలబడి నవ్వడంలోనే
జీవితానికి సరిపడా సంపద సాధించిన తృప్తీ ఉంది.
తెలంగాణ దోపిడీ గడీ…
బంజారాహిల్స్ పసుపు కోటలో..
ఉప్పలాలు…. గబ్బిలాల స్థిర నివాసమే…
ఈ కథకు క్లయిమాక్స్…
రంగు పేపర్లు, డబ్బాలతోనే దేశాన్ని ఏలేద్దామనుకునే …
లఫూట్ గాళ్లు
కూలిన కోటలో కూర్చుని కుట్ర రచనలు చేయలేక
దిక్కు తోచక జుట్టు పీక్కోవడమే
ఈ యుద్ధం ప్రస్తానంలో గొప్ప మజిలీ…
—
ఆక్రోశించనీయండి…
ప్రజాస్వామ్యమంటూ… రాజకీయ వ్యభిచారమంటూ
వెన్నుపోటు అంటూ…పార్టీకి ద్రోహమంటూ…
రంకెలేయమనండి.. శోకాలందుకోనివ్వండి..
పాపం…
బ్రాండ్ అంబాసిడర్లనూ…
కోరస్ కలపనివ్వండి..
మైల పురాణాల పారాయణాలు …
కుల వైర భారత హరికథా గానాలు…
శవ పంచాష్టకాల వల్లింపులు…
నిందలు నిష్టూరాలు…అన్నీ కలగలిపి
ఆరునొక్క రాగం అందుకోనివ్వండి.
—
సహజమే…
రావణ వధ లోకానికి కల్యాణ కారకమైనా…
మండోదరికి వైధవ్యమే కదా!