mt_logo

పాలమూరు జిల్లాకు స్వరాష్ట్రంలో న్యాయం- ఎంపీ కవిత

సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు జిల్లాకు స్వరాష్ట్రంలో న్యాయం జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఆరోరోజు బతుకమ్మ ఉత్సవాలు నేడు మహబూబ్ నగర్ కొత్తకోటలో జరుగుతున్న సందర్భంగా ఎంపీ ఆ వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్నారు. కందూరి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందూరులో కాశీలో మాదిరిగా కదంబ కల్పవృక్షాలు ఉన్నాయని, కందూరును తెలంగాణ శ్రీశైలంగా, దక్షిణ కాశీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *