By: విశ్వరూప్
బ్రిటిష్ వాడు ఇంతపెద్ద మనదేశాన్ని ఆక్రమించుకుని నాలుగొందలఏళ్ళు మనమీద పెత్తనం ఎలా చేయగలిగాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. మన మీద పరాయివాడు పెత్తనం చెయ్యగలగడానికి కారణం మన ఇంటిదొంగలే. అలాగే ఈనాడు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నసమయంలో కూడా ఆంధ్ర నాయకులు మనమీద జులుం చెయ్యగలగడానికి కారణమూ ఇంటిదొంగలే.
ఇంటిదొంగలు మనకే ప్రత్యేకం కాదు, ఎక్కడయినా ఉంటారు. ఒకవేళ సమైక్యాంధ్రలో తెలంగాణకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండి పెత్తనం తెలంగాణ వద్ద ఉంటే, ఆంధ్రా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ఉంటే అక్కడా ఇంటిదొంగలు ఉండేవారు. సమాజంకంటే తన సొంత లాభమే ఎక్కువ అనుకునేవారిని పసిగట్టి, పెత్తనం చేసేవారు వారికి పదవులూ, డబ్బూ ఆశ జూపి లోబరుచుకుని మిగతా సమాజానికి వ్యతిరేకంగా పని చేయిస్తారు. అలాంటివారే ఈ ఇంటిదొంగలు.
చంద్రబాబు మన గడ్డమీద పరాయి కిరాయిరౌడీలను తీసుకొచ్చి మన యువకులనే కొట్టించగలిగాడంటే కారణం ఇక్కడి ఇంటిదొంగలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్ లాంటివారే. కిరణ్‌రెడ్డి ఇక్కడికొచ్చి మననేతలనే తిట్టగలుగుతున్నాడంటే దానికి కారణం ఇక్కడి ఇంటిదొంగలు డీకే అరుణ, జానారెడ్డి లాంటివారే. మరి ఈ ఇంటిదొంగలకు ఇంత బలం ఎలా వచ్చిందంటే వారి దగ్గర ఉండే కొద్దిమంది అనుచరవర్గం కారణం.
తెలంగాణ ప్రజలు ఇంటిదొంగల భరతం పట్టడం ఎప్పటినుంచో మొదలు పెట్టారు. ఆంధ్రాబాబులకు మద్దతు పలికే తెలంగాణ నేతలకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. అయితే ఈక్రమంలో మన యువకులకే దెబ్బలు తగులుతున్నాయి…కారణం ఎదుటివాడు మనకంటే బలవంతుడు. అలాంటప్పుడు మనం ఏంచేయాలి? శతృవు బలంపై దెబ్బకొట్టాలి. ఈ ఇంటిదొంగల బలం వారి అనుచరవర్గమయినప్పుడు ముందు మన లక్ష్యం ఈ అనుచర వర్గమే కావాలి. ఈ ఇంటిదొంగలందరికీ సామాజిక బహిష్కరణ విధించాలి. భవిష్యత్తులో ఒక మోత్కుపల్లికో ఒక డీకే అరుణకో అనుచరుడిగా ఉండాలంటే వీల్లు భయపడాలి.
ఇంటిదొంగలకూ, వారి అనుచరులకు పెల్లిచేసుకుందామంటే పిల్ల దొరకగూడదు. ఊరిలో ఉప్పు పుట్టకూడదు. మున్సిపాలిటీ నీల్లు రాకూడదు, ఇంట్లో పనిమనుషులు దొరకగూడదు. వీల్లపొలాలు సాగుచేసుకుంటే కూలివాల్లు దొరకగూడదు, వీల్ల ఇంట్లో ఎవరయినా చస్తే డప్పుకొట్టేవారు, పాడె కట్టేవారు దొరకగూడదు. ఇకనుంచీ మన నినాదం ఇదీ..”ఇంటి దొంగల పని పడదాం…తెలంగాణ సాధిద్దాం”.