శుక్రవారం జరగనున్న అంతర్జాతీయ ఆరోగ్య పరిరక్షణ సదస్సును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో మూడురోజులపాటు జరిగే ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, మందుల కంపెనీలు, దవాఖాన సంస్థలు పాల్గొననున్నాయి. అమెరికా, చైనా, కెనడా, ఆస్ట్రేలియా సహా దాదాపు 30దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి.
సదస్సులో రెండవరోజు రాష్ట్ర ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, మూడవరోజు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ రాజయ్య పాల్గొంటారని తెలిసింది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందించిన దేశవిదేశాలకు చెందిన వైద్యనిపుణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వనున్నారు.