అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి గానూ తాము ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీని ఎంపిక చేశారు. ఈ అవార్డు స్వీకరించేందుకు రావాల్సిందిగా సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ ను బెర్క్ షైర్ మీడియా సీఈవో శ్రీ హేమంత్ కౌశిక్, వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానించారు. ఈ అవార్డును మార్చి 8, 2019న ముంబైలోని లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతిమీదుగా ప్రధానం చేయనున్నారు.

