mt_logo

క్రెడాయి ప్రాపర్టీషోను ప్రారంభించిన ఎంపీ కవిత..

మాదాపూర్ హైటెక్స్ లో క్రెడాయి ప్రాపర్టీషోను నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వ్యవసాయరంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు రియల్ ఎస్టేట్ రంగానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, టీఎస్ఐపాస్ ద్వారా గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని కవిత పేర్కొన్నారు.

గత ఐదేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగుంది. 368 కిలోమీటర్ల మేర రాబోయే రీజినల్ రింగ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లు కేటాయించబోతుందని ఎంపీ తెలిపారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని, హరితహారం కార్యక్రమంలో క్రెడాయి పాల్గొని మొక్కలు పెంచడం అభినందనీయమని అన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు తప్పకుండా భీమా చేయించాలని ఎంపీ కవిత సూచించారు. కాగా ఈ ప్రాపర్టీ షో మూడు రోజులపాటు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *