కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు వచ్చేనెల 2, 3 తేదీల్లో కవిత ఈ సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.
ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను జనవరి 1న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బీహార్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.