గ్రీనరీలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రోజురోజుకి నగరంలో అర్బన్ ఫారెస్ట్ లు, పార్కులు, ఫారెస్ట్ బ్లాక్ లతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. ప్రపంచ పర్యావరణవేత్త అయిన ఎరిక్ సోల్హెమ్ తన సోషల్ మీడియా వేదికగా భాగ్యనగర పచ్చదనపు చిత్రాలను షేర్ చేశారు. దానితో పాటు భారత్ లో నిజమైన గ్రీన్‌సిటీ అంటే హైదరాబాద్ అని, ఇలాంటి అందమైన నగరాన్ని ప్రపంచ అటవీ నగరంగా ప్రకటించాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్… థాంక్ యూ ఎరిక్ సోల్హెమ్ అంటూ ఆ చిత్రాలను రీట్వీట్ చేశారు.

