హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైన నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, జలవిహార్, తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితి, ప్రక్షాళనకై తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్సేన్ సాగర్ సందర్శించిన వారిలో సీఎంతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, కొత్తగా ఇచ్చే రుణాల పంపిణీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారని తెలిసింది.
