mt_logo

చేనేతపై జీఎస్టీ రద్దు పోస్టుకార్డు ఉద్యమానికి విపరీత స్పందన

చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సహా సామాన్యులు సైతం చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీకి పోస్టుకార్డులు రాస్తున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ చేంజ్‌.ఆర్గ్‌ అనే ఆన్లైన్ పిటిషన్ ఉద్యమం ప్రారంభించి, ప్రతిఒక్కరూ ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌పై సంతకం చేయాలని.. ఈ మహోన్నత లక్ష్యం కోసం ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కవిత, ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు వేలాది చేనేత కార్మికులు పోస్టుకార్డు ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. కాగా ప్రస్తుతం ఈ ఉద్యమం  సామజిక మాధ్యమాల్లో రోల్ బ్యాక్ హ్యాండ్లూమ్ జీఎస్టీ పేరుతో ట్రెండింగ్ అవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *