రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోండి : హెచ్‌ఎండీఏ

  • May 11, 2022 1:36 pm

రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను హెచ్‌ఎండీఏ అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. దీనిప్రకారం బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. మరో 1082 ఫ్లాట్లలో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తిగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలు, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకి రూ.2,750గా నిర్ణయించింది. ఇక పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి. పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. గురువారం నుంచి జూన్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి కలిగినవారు మీ సేవ పోర్టల్‌, కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. రేపట్నుంచి జూన్ 14 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది. మీ సేవ పోర్టల్, స్వగృహ వెబ్‌సైట్, మొబైల్‌యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత లాటరీ ద్వారా వచ్చే నెల 22న ఫ్లాట్లను కేటాయించనున్నారు.


Connect with us

Videos

MORE