mt_logo

సీమాంధ్ర సర్కారుకు హైకోర్ట్ షాక్

హైదరాబాద్ నగరంలో శివారు గ్రామాలు విలీనం చేసి, నగరాన్ని యూటీ చేద్దామని కుట్ర చేసిన సీమాంధ్ర సర్కారుకు హైకోర్ట్ షాకిచ్చింది. శివారు పంచాయతీలను గ్రేటర్ లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది.

సీడబ్లూసీ తెలంగాణ నిర్ణయం వెలువరించాక హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని 35 గ్రామాలను గ్రేటర్ లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోని కొన్ని గ్రామాలకు అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ప్రతిపాదన లోని ఏ ఒక్క గ్రామం కూడా ప్రభుత్వం తీసుకున్న విలీన ప్రతిపాదనను ఒప్పుకోలేదు. ఐనా ప్రభుత్వం మాత్రం కార్పొరేటర్లు, గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

17 గ్రామాల విలీన నిర్ణయంపై విచారణ చేపట్టిన కోర్టు గురువారం విలీనం జీవోను రద్దు చేసింది. దీంతో ఆయా గ్రామాలకు తాత్కాలిక వూరట లభించగా ప్రభుత్వం మాత్రం అభాసుపాలైంది.

స్థానికులను కనీసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే గడువు కూడా ఇవ్వకుండా కుట్రపూరితంగా సర్కారు విలీన నిర్ణయాన్ని తీసుకుందని తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉత్తర్వులు వెలువడుతున్న సమాచారాన్ని ముందే జీ.హెచ్.ఎంసీ అధికారులకు అందించి, హడావిడిగా ఆయా పంచాయతీల్లో రికార్డులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేయడంతో కోర్టు జీవో రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *