టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్న బీజేపీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నలిస్తూ… హైకోర్టు సింగిల్ జడ్జ్ విజయ్ సేన్ రెడ్డి అధీనంలో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలని, దర్యాప్తుకు సంబంధించిన వివరాలు బయటకు వెల్లడించానికి వీలు లేదని హైకోర్టు సూచించింది. దర్యాప్తు పురోగతి నివేదికను ఈ నెల 29న సింగిల్ జడ్జి ముందు సమర్పించాలని తెలియజేసింది.
