శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రికి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో జీహెచ్ఎంసీ అధికారులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. కాగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఉప్పల్, మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్, బాలానగర్, నాగారం, మౌలాలి, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాంపల్లి, మెహిదీపట్నం, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, కోఠి, అబిడ్స్, ముషీరాబాద్, ట్యాంక్ బండ్, సీతాఫల్ మండి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, సఫిల్ గూడ, కూకట్‌పల్లి, మియాపూర్, బాలానగర్, చందానగర్, కుత్బుల్లాపూర్, బేగంపేట్, సనత్ నగర్, నేరేడ్‌మెట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది.