mt_logo

చంద్రబాబుపై హరీష్ రావు ఫైర్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్మాదిలా తయారయ్యాడని, ఉన్మాద భాష మాట్లాడుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ అంశాన్ని కాశ్మీర్, శ్రీలంక తో పోల్చడం చంద్రబాబులో ఉన్న పైశాచికానందాన్ని తెలుపుతుందని అన్నారు. ఇందిర, రాజీవ్ ల హత్యలను పదేపదే ప్రస్తావిస్తున్న చంద్రబాబు మనసులో ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. చైనాలో అయితే చంద్రబాబు మాట్లాడే మాటలకు ఉరితీసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, గాడ్సే పదాలను మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని చెప్పారు. తన మామ ఎన్టీఆర్ ను చంద్రబాబు గాడ్సే కంటే దారుణంగా చంపారని, చంద్రబాబు లాంటి నీచుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడని ఎన్టీఆరే చెప్పారని, దశమగ్రహమని కూడా అన్నారని గుర్తుచేశారు. తెలంగాణపై చంద్రబాబు విషం కక్కుతుంటే తెలంగాణ టీడీపీ నేతలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *