mt_logo

కాంగ్రెస్ నేతలకు మోసం చేయడమే తెలుసు- హరీష్ రావు

మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు మోసం చేయడమే తెలుసు. 1971 లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే రాహుల్ గాంధీ కూడా ఇప్పటికీ అదే మాట చెప్తున్నాడు. పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ నేతల పని. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏండ్లు అయినా పేదలు ఇంకా పేదవారిగానే ఎందుకున్నారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వృద్ధులు, వితంతువులను సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా చూసుకుంటున్నారు. 57 ఏండ్లు నిండిన వారందరికీ రూ. 2016 పెన్షన్ ఇస్తాము. నిరుద్యోగులకు రూ. 3 వేల భ్రుతి, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని హరీష్ రావు తెలిపారు.

అనంతరం నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలం మల్కాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని హరీష్ రావు మాట్లాడారు. ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నర్సాపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలపాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *