mt_logo

రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్: హరీష్ రావు

రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నరు.. అమలు కాలేదు అని పేర్కొన్నారు.

మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం విన్న తర్వాత తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించాం అని తెలిపారు.

ఎన్నికల రాజకీయ రాష్ట్ర మార్చడానికి తప్ప అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రతిష్టను రాష్ట్ర గొప్పతనాన్ని పెంచే విధంగా పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యమంత్రికి మంచిది. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర అప్పుల గురించి ప్రచార సభల్లో, ప్రభుత్వ వేదికలపై చివరకు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కూడా అవే అబద్ధాలు మాట్లాడుతున్నారు అని అన్నారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధాల పునాదుల మీద. అబద్దాలతో ప్రజలు నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నరు.. అమలు కాలేదు. డిసెంబర్ 9న నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటిన రుణమాఫీ పూర్తి కాలేదు అని విమర్శించారు.

కళ్యాణ ణలక్ష్మీ, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం అన్నారు.. అదీ లేదు  ఐదు లక్షల రూపాయల విద్య భరోసా కార్డు అన్నారు.. రూ. 4వేలు ఆసరా పింఛన్ అన్నరు ఇప్పటివరకు ఇవ్వలేదు.పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన రోజే ఇచ్చారు అని అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రూ. 200 పింఛన్‌ను మొదటి నెలలోనే వెయ్యికి పెంచాడు. రెండోసారి అధికారం రాంగనే రెండు వేలకు పెంచారు. పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పింఛన్ అందించలేకపోయారు అని పేర్కొన్నారు.

అబద్ధాలతో అధికారంలోకి రావడమే కాక.. దురదృష్టకరమైన విషయం ఏటంటే అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అసెంబ్లీ వేదికగా అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఆ రోజే రూ. 6.85 లక్షల కోట్లు అప్పులు చెప్పారు. డిసెంబర్‌లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఆరు నెలల్లో చేయబోయే అప్పులను కూడా ఇందులో కలిపి చెప్పారని ఆరోజే స్పష్టంగా చెప్పాను అని హరీష్ రావు గుర్తు చేశారు.

బడ్జెట్ సమావేశాల్లో కూడా నిన్ను శాసనసభలో అప్పులపై నేనే స్వయంగా విడమర్చి చెప్పాను. అయినా సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తుంది. శాసనసభలో ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రికి కూర్చోబెట్టి తెలంగాణ అప్పుల గురించి వివరాలు చెప్పిన అక్కడ నోరు మూసుకొని బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.

రూ. 6,85,000 కోట్లు కాదు.. కేవలం రూ. 4,26,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పు అని చాలా స్పష్టంగా చెప్పినం. రూ. 4,26,000 కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి ఇచ్చిన రూ. 9,000 కోట్లు ఉన్నాయి.కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ కోసం బలవంతంగా ఒత్తిడి చేసి రూ. 27 వేల కోట్లు చేసిన అప్పు అని తెలిపారు.

రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ. 2,459 కోట్లు గ్రాంట్‌కి ఇవ్వాల్సింది కూడా అప్పులోనే కలపడం వల్ల.. ఇవన్నీ కలిపి రూ. 4,26,000 కోట్లు తెలంగాణ అప్పు. ఇక ముఖ్యమంత్రి ఏమో ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ఓసారి ఆరు లక్షల కోట్ల అని, ఏడు లక్షల కోట్లని విచ్చలవిడిగా అబద్ధాలు చెబుతున్నారు అని ధ్వజమెత్తారు.

ఏ ముఖ్యమంత్రి అయినా దివాలా దివాలా అంటే రాష్ట్ర పరువు ఉంటదా? పరపతి ఉంటదా? రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలే ముఖ్యంగా ప్రవర్తిస్తున్నావ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. ఉన్నన్ని రోజులు ప్రజల కోసం పనిచేయాలి అని సూచించారు.

రేవంత్‌కు.. ప్రతిరోజు లేవంగానే కేసీఆర్‌ను తిట్టకపోతే బ్రతకలేను అనే శాపం ఉన్నట్టుంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్న పరిష్కరించకుండా ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారు. విద్యా ఆరోగ్యం ఇలా అన్ని రంగాల్లో సమస్యల పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించేందుకు ఆలోచన చేయాలి అని అన్నారు.

ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గర ముఖ్యమంత్రి చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారు. స్వయంగా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంపైకి తుపాకి పట్టుకొని వచ్చిన గొప్ప నాయకుడు. ఇలాంటి వాళ్లు వెళ్లి ఈరోజు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడం చూస్తే ఎంతో బాధ కలిగింది అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో  రూ. 1,12,162 రూపాయలు. ఈరోజు రూ. 3,47, 229 దేశంలో నెంబర్ వన్ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ.. ఈ ఘనత కేసీఆర్‌ది కాదా. జీఎస్‌డీపీలో తెలంగాణ రూ. 4,51,000 కోట్లు ఉంటే. ఈ రోజు రూ. 14,63,000 కోట్లకు పెంచారు. 163% జీఎస్డీపీ పెరిగిందంటే ఇది కేసీఆర్ కృషి కాదా అని అడిగారు.

రాష్ట్ర ఆదాయం పెరిగింది.. రాష్ట్ర ఆస్తి పెరిగింది.. రాష్ట్ర సంపద పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినం. పాలమూరు ఎత్తిపోతుల ఎన్ని పథకాలు కట్టినం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. దాని గురించి ఎందుకు మాట్లాడవ్ అని హరీష్ ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం.. దాని గురించి ఎందుకు మాట్లాడరు. నిజాలను చెప్పడం అంటే రేవంత్‌ రెడ్డికి భయం అని ఎద్దేవా చేశారు.