mt_logo

నిరుపేద మెడిసిన్‌ విద్యార్థికి అండగా నిలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిరుపేద వైద్య విద్యార్థి చదువుకు చేయూతనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని కత్తుల అలివేలు డాక్టర్ కావాలనే దృఢ సంకల్పంతో చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించించి. రంగారెడ్డి జిల్లా మొహినాబాద్‌లోని భాస్కర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ లభించింది. అయితే ఆ కళాశాలలో చేరడానికి ట్యూషన్ ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించారు. వెంటనే ఆయన తన తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆ అమ్మాయి చదువుకు అవసరమైన 50,000 రూపాయల సహాయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి తన తండ్రి కీర్తిశేషులు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున అందించారు. డాక్టర్ కావాలనే తన లక్ష్యానికి ఆర్థిక సహాయాన్ని అందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డికి కత్తుల అలివేలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *