యునైటెడ్ కింగ్డమ్ (UK) ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహిస్తున్న “Education World Forum 2016” 2016కు హాజరయ్యేందుకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి – డెప్యుటీ సీఎం కడియం శ్రీహరి గారు లండన్ చేరుకున్నారు.
ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ ఆధ్వర్యంలో లండన్ హీత్‌రొ ఏర్‌పోర్ట్‌లో కడియం శ్రీహరి గారికి ఘనస్వాగతం పలికారు. యూకే వ్యాప్తంగా ఉన్న కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
ఇతర ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు మరియు తెలంగాణ వాదులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీ్లు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యు.కే ఇంచార్జ్ విక్రం రెడ్డి, లండన్ ఇంచార్జ్ రత్నాకర్, అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్ల, సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ ఆకుల, సత్య, సృజన్ రెడ్డి చాడా మరియు తెలంగాణ ఎన్నారై ఫోరం అడ్వైసరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, అలాగే జీ.ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.