mt_logo

హైదరాబాద్ లో గూగుల్ సొంత క్యాంపస్..

అమెరికా తప్ప వేరే ఏ దేశంలో సొంత క్యాంపస్ లేని గూగుల్ దిగ్గజం తన అతిపెద్ద సొంత కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మించేందుకు సిద్ధమైంది. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు రూ. వెయ్యికోట్లతో ఈ క్యాంపస్ ను నిర్మించనున్నారు. దీంతో హైదరాబాద్ లో గూగుల్ సిబ్బంది సంఖ్య రానున్న నాలుగేళ్ళలో 13వేలకు చేరుకుంటుంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా రాష్ట్రం మౌంటెన్ వ్యూ లోని గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ ప్లెక్స్ లో అంతర్జాతీయ వసతులు, కార్యాలయాల అధ్యక్షుడు డేవిడ్ రాడ్ క్లిఫ్ తో సోమవారం సమావేశమై ఈ అంశానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గూగుల్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొట్టమొదటి సొంత క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుందని, ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ అని చెప్పారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం అవుతుందని, ఇందుకోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్ లో 7.2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గూగుల్ అధ్యక్షుడు (అంతర్జాతీయ వసతులు కార్యాలయాలు ) డేవిడ్ రాడ్ క్లిఫ్ ఈ నిర్మాణం గూగుల్ సంస్థ సుమారు పన్నెండు నెలల పాటు కాంపస్ తాలూకు డిజైన్లు ప్రణాళికలు రూపొందించుకొని నాలుగు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి  చేస్తుందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే రెండు మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని, 2019 నాటికి పూర్తి స్థాయి కాంపస్ నిర్మాణం పూర్తి చేసుకొని తమ కార్యకలాపాలు మొదలు అవుతాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *