ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో కొమురం భీం స్మారక గిరిజన మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ సర్కారు రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఇటీవల మరణించిన రచయిత పైడి తేరేష్ బాబు కుటుంబానికి కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం రాజయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమై గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో నెలకొన్న జూనియర్ డాక్టర్ల సమస్యలపై చర్చించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించబోమని జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో వైద్య సేవలు అందించాలన్న జీవోను రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.