mt_logo

జీహెచ్‌ఎంసీ మొబైల్‌ షీ టాయిలెట్స్

మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన జీహెచ్‌ఎంసీ మొబైల్‌ షీ టాయిలెట్స్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌లోని ఆరు జీహెచ్‌ఎంసీ జోన్లలో వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ జోన్‌లో మూడు వాహనాలు, ఎల్‌బీనగర్‌ జోన్‌లో మూడు, ఖైరతాబాద్‌ జోన్‌లో రెండు, చార్మినార్‌ జోన్‌లో రెండు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్‌ మొబైల్‌ బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలైన ట్యాంక్‌బండ్‌, ధర్నాచౌక్‌, చార్మినార్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, ప్రగతిభవన్‌, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్‌, రాజేంద్రనగర్‌, బాలానగర్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో మహిళల రద్దీకి అనుగుణంగా అందుబాటులో ఉంచనున్నారు.

ఒకే వాహనంలో ఇండియన్‌, వెస్ట్రరన్‌ మోడల్‌లో టాయిలెట్స్‌ ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిల్వ ఉంచిన వ్యర్థాలను మున్సిపల్‌ సీవరేజీ ట్యాంకుకు అనుసంధానం చేస్తారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు (బెస్ట్‌ ఫ్రీడింగ్‌ రూమ్స్‌ )లు ఉంటాయి. మడత కుర్చీలు, చిన్నారులకు డైపర్‌ చేంజ్‌ చేసుకునేందుకు టేబుల్‌ అందుబాటులో ఉంటుంది. మహిళలకు సౌకర్యవంతంగా పరికరాలను, సామన్లు పెట్టుకునేందుకు లాకర్లు, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. అన్ని వాహనాల్లో చంటిపిల్లలకు పాలిచ్చేందుకు గదితో పాటు శానిటరీ నాప్‌కిన్స్‌ వంటివి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. 

వివిధ మెట్రో నగరాల్లో సేఫ్‌ సిటీ ప్రాజెక్టు కింద మహిళల రక్షణ, భద్రతలకు సంబంధించిన సదుపాయాల కోసం ‘నిర్భయ’ ఫండ్స్‌ నుంచి నిధులు అందజేస్తున్నారు. ఆ నిధులతో మహిళల మొబైల్‌ టాయిలెట్ల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు సమకూర్చుతున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *