పంజాగుట్ట జంక్షన్లోని హైదరాబాద్ సెంట్రల్ మార్క్ వద్ద రూ. 5 కోట్లతో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పాదచారులకు అందుబాటులోకి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం బ్రిడ్జిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి ప్రారంభించారు. పంజాగుట్ట జంక్షన్ లో వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఇక్కడ పాదచారులు రోడ్డును దాటేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నగరంలో మరో 6 నిర్మాణంలో ఉన్నాయని, వీటిని 4 నుంచి 6 వారాల్లో ప్రారంభించనున్నారు.