వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేయనని, ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. వామపక్షాలు తనను ఎలాంటి నిర్దిష్టమైన విధానం, ప్రణాళిక లేకుండానే ఉప ఎన్నికలో పోటీ చేయాలని ప్రతిపాదించాయని, ఎన్నికల విధానం ఏంటో, మ్యానిఫెస్టో ఎలా ఉండాలో చర్చలే లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడదని తాను వారికి చెప్పానని గద్దర్ తెలిపారు. దీంతో వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన అవసరం పడింది. ఇదిలావుండగా గద్దర్ ను సంప్రదించకుండానే వామపక్షాలు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాయి. ఈ విషయమై ఆయన ఇంటికి వెళ్లి ఉపఎన్నికలో పోటీ చేయాలని ఆహ్వానించగా పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని గద్దర్ వారికి చెప్పారు. కానీ చివరకు గద్దర్ పోటీ చేయనని తాజాగా ప్రకటించడంతో వామపక్షాలకు మళ్ళీ అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.