mt_logo

తెలంగాణ డిమాండ్ ఎన్నో ఏళ్ళుగా ఉంది – షిండే

తెలంగాణ బిల్లు చరిత్రాత్మక బిల్లు అని, తెలంగాణ ఏర్పాటు చారిత్రక అవసరమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఈ రోజు లోక్‌సభలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు అవసరమో షిండే వివరించారు. సామాజికంగా, ఆర్ధికంగా తెలంగాణ వెనుకబడింది. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు మానసికంగా ఎప్పుడో విడిపోయారు. తెలంగాణ ప్రజలు స్వయం పరిపాలన కోరుకుంటున్నారు. అందరికీ సమన్యాయం చేయాలన్నదే మా లక్ష్యం. తెలంగాణపై అనేకసార్లు సంప్రదింపులు జరిపాం. తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *