mt_logo

రాజ్యసభలో టీ బిల్లు ఆమోదం ఖాయం-ప్రధాని

లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో రాజ్యసభలో కూడా బిల్లును పాస్ చేసేలా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో చర్చల్లో భాగంగా రాజ్యసభలో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీని, ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. రాజ్యసభలో బిల్లుకు ఏవిధమైన అడ్డంకులు లేకుండా పాస్ అయ్యేలా చూడాలని అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. తర్వాత అరుణ్ జైట్లీ, మరికొందరు బీజేపీ నేతలతో ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి కలిశారు. తెలంగాణ బిల్లు గురువారం రాజ్యసభలో తప్పకుండా ఆమోదం పొందుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. తనను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమై తెలంగాణ బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని, బీజేపీ తప్పకుండా బిల్లుకు మద్దతు తెలుపుతుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యేలకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *