—
సినీ పరిశ్రమ లో తెలంగాణా వారి ప్రతిభ ను గుర్తింపు కల్గించి, వెలికి తీయాలనే ఉద్దేశ్యం తో తెలంగాణా నెటిజెన్స్ ఫోరం (TNF) – ఫిలిం తెలంగాణా సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన ఫిలిం తెలంగాణా – 2013 పండుగ నిన్న సాయంత్రం 3 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిదులుగా జాక్ చైర్మన్ కోదండ రామ్, వరవర రావు, ఈటెల రాజేందర్, దుశ్చర్ల సత్యనారాయణ , వేద కుమార్, డైరెక్టర్ నర్సింగరావు , దేవి ప్రసాద్, చిత్రం శీను, దాస్యం వినయబాస్కర్, రోషం బాలు (తెలంగాణా హీరో ), 1969 ఉద్యమకారుడు బాలకుమార్ లు హాజరయ్యారు.తెలంగాణా ఇతివృత్తం, పల్లె జీవితాలు కళ్ళకు కట్టెల తీసిన దర్శకులను, సహకరించిన వారిని, కళాకారులను అతిధులు అభినందిచారు. కోదండరామ్ గారు మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్ర ప్రక్రియను అడ్డుకోవడం లో ఈ సమైక్యాంధ్ర చేతుల్లో ఉన్నటువంటి చిత్ర సీమ ప్రముఖులు ఉన్నట్లు, వారు తమ బుద్ది మార్చుకొని తమ పని తాము చేస్కుంటే భవిష్యతు తెలంగాణా లో వారి సినిమాలను ఆడరిచే అవకాశాలు ఉంటాయన్నారు .. దానితో పాటు తెలంగాణా లో ఉన్న కళాకారులను పైకి తీసుకవచ్చే భాద్యత కూడా వారిదే అని తెలిపారు.
తెలంగాణా మరియు సామాజిక ఇతివృత్తాలతో నిర్వహించిన పోటీలకు మొత్తం 25 ఎంట్రీలు రాగా , అందులో నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ విభాగాల్లో పనిచేసిన వారిని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో బాగంగా ఉత్తమ చిత్రం గా యాది, ఉత్తమ దర్శకుడుగా అన్షుల్ సిన్హా (లపేట్ ), ఉత్తమ మ్యూజిక్ గా గోల్డెన్ ఫెలిక్స్ (యాది), ఉత్తమ సినిమాటోగ్రఫి గా శిరుని నరేష్ (యాది), ఉత్తమ రెండో చిత్రంగా ఎంతెంత దూరం, ఉత్తమ మూడో చిత్రంగా స్ట్రేంజర్ లు ఉన్నారుఎంపికయ్యాయి. ఇక అన్నీ తామే అయి తెలంగాణా ఇతివృత్తమే కథ గా చేస్కొని తిరగబడ్డ తెలంగాణా పేరుతో నెటిజెన్స్ ఫోరం వారు తీసిన సినిమా ప్రత్యేక జ్యూరి అవార్డును అందుకుంది. ఇలాంటి ప్రోగ్రాముల ద్వారా తెలంగాణా పల్లెల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీస్తున్నందుకు TNF- ఫిలిం తెలంగాణా వారిని కోదండరామ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఎంతెంత దూరం చిత్రానికి వచ్చిన ప్రైజ్ మనీ మొత్తాన్ని APNGO సభలో జై తెలంగాణ నినాదం చేసి, దాడికి గురైన కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడుకు బహుమతిగా అందజేసింది చిత్రం యూనిట్.
—
ఫిలిం తెలంగాణా ఫౌండర్, TNF మెంబెర్ జయప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణా కళాకారులు సమైక్యాంధ్ర లో తొక్కి వేయబడ్డారని, కులాధిపత్యం వాళ్ళ అనచివేయబడ్డారని, అలంటి వారికోసమే ఈ ప్రోగ్రాం ను నిర్వహించామని, ఈ ప్రోగ్రాం కోసం రాత్రి పగళ్ళు కష్టపడ్డ TNF వారి నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మా భూమి సంధ్యక్క పాడిన పాటలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ గా నిలువగా, యాంకర్స్ శ్రీనివాస్ దాసరి మరియు భావన గోపరాజు లు తమ మాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మొన్నటి TNGO వారి సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో తెలంగాణా నినాదాలు చేసి దెబ్బలు తిన్న చేగొండి చంద్రశేఖర్ ను TNF సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమానికి తెలంగాణా ప్రొటెక్షన్ ఫోరం మరియు తెలంగాణా హౌస్ సర్జన్, మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ లు పూర్తి సహాయ సహాకారాలు అందజేసి విజయవంతం అవడంలో కీలక పాత్ర వహించారు. కార్య క్రమంలో TNF సభ్యులు, అభిషేక్ రెడ్డి , హరికాంత్ , నీల లోహిత్, రాజ్ మొకిడే, శ్రావణ్ , శ్రీధర్ , అరుణ్ , రమణ రెడ్డి , సాయి ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .. ప్రోగ్రాం చేయడానికి ముందుకొచ్చిన జయప్రకాష్ గారికి TNF తరుపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
తెలంగాణా చరిత్ర ఇతివృత్త ఆదారంగా TNF వారు స్వయంగా నటించి, నిర్మించిన ”తిరగబడ్డ తెలంగాణా ” త్వరలో YouTube లో వస్తుంది ..
[Photo Courtesy: TG Gopichand]