mt_logo

ఫాస్ట్ పథకానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం..

ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి రూ. 271 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వార్డులను పునర్విభజన చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నం. 12 ను విడుదల చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి నివేదిక అందజేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *