బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను తెలంగాణ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సభ తప్పుపట్టింది. ఈ మేరకు అసెంబ్లీ సబ్ రూల్ 2, రూల్ 340 కింద బీజేపీ ఎమ్మెల్యే ఈటలను సస్పెండ్ చేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ దానిని ఆమోదించింది. సమావేశాలు ముగిసే వరకు ఈటెలపై సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే సారీ చెప్పేందుకు ఈటల నిరాకరించడం వల్లే ఆయన్ను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని మంత్రి వేముల స్పష్టం చేస్తూ… స్పీకర్ పోచారంపై రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని పేర్కొన్నారు.

