mt_logo

తెలంగాణ అమరవీరులకు విద్యుత్ ఉద్యోగుల భూరి విరాళం

 

స్వరాష్ట్ర ఉద్యమంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న తెలంగాణ ప్రాంత విద్యుత్ రంగ ఉద్యోగులు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తెలంగాణపై పాలకుల వైఖరితో నిరాశ నిస్పృహలకులోనై ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో సెంట్రల్ పవర్ డిస్కమ్ (సీపీడీసీఎల్) ఉద్యోగులు ‘నమస్తే తెలంగాణ’ నెలకొల్పిన ‘నమస్తే తెలగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’కి భారీ విరాళం అందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్షికమంలో సొసైటీ చైర్మన్, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజంకు రూ.17 లక్షల చెక్కును అందజేశారు. తొలుత రూ. 15 లక్షల చెక్కు సిద్ధం చేసినా కార్యక్రమం సమయానికి ఆ మొత్తం 17 లక్షలకు పెరిగింది. ఆచార్య జయశంకర్‌సార్ జయంతి ఆగస్టు 6న మరో రూ.3 లక్షలను అందజేస్తామని టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ ప్రకటించారు. రిలీఫ్ సొసైటీకి ఇప్పటివరకు అందిన విరాళాల్లో మూడో వంతు విద్యుత్ ఉద్యోగులవే కావడం విశేషం.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న ఈ ప్రాంత విద్యుత్‌రంగ ఉద్యోగులు.. తెలంగాణ కోసం కలలుకని పాలకుల వైఖరితో నిరాశ నిస్పృహలకులోనై ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో సెంట్రల్ పవర్ డిస్కమ్ (సీపీడీసీఎల్) ఉద్యోగులు ‘నమస్తే తెలంగాణ’ నెలకొల్పిన ‘నమస్తే తెలగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’కి భారీ విరాళం అందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజంకు రూ.17 లక్షల చెక్కును అందజేశారు. సీపీడీసీఎల్ పరిధిలోని మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి (నార్త్, సౌత్, ఈస్ట్), హైదరాబాద్ (నార్త్, సౌత్, సెంట్రల్) సర్కిళ్లకు చెందిన విద్యుత్ ఉద్యోగులతోపాటు సీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, స్కాడా సర్కిల్ ఉద్యోగులు మొత్తం 450 మంది రూ.17లక్షలు విరాళాలు సేకరించి ‘నమస్తే తెలంగాణ వెల్పేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’కి అందించారు. గతంలో కేటీపీఎస్ విద్యుత్ ఉద్యోగులు రూ. 3 లక్షలకుపైగా, గత డిసెంబర్‌లో విద్యుత్ సౌధ విద్యుత్ ఉద్యోగులు రూ. 5 లక్షలు రిలీఫ్ సోసైటీకి అందించారు.
సిటీబ్యూరో (హైదరాబాద్), జూలై 18 ( టీ మీడియా): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌సార్ జయంతి ఆగస్టు 6న మరో రూ.3 లక్షలను రిలీఫ్ సొసైటీకి అందజేస్తామని ఈ సందర్భంగా టీఈఈఏ అధ్యక్షుడు ఎన్ శివాజీ ప్రకటించారు. ఇదే వేదికగా ఆరుగురు అమరుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం అందజేశారు. ఎర్రగడ్డ జేటీఎస్ కాలనీలోని ఏపీ జెన్‌కో ఆడిటోరియంలో టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ అధ్యక్షతన ‘పది జిల్లాల తెలంగాణే కావాలి – ప్యాకేజీలు వద్దు’ పేరుతో నిర్వహించిన ఈ సదస్సులో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌డ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లంనారాయణ, సీఈవో కట్టాశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, పెద్దసంఖ్యలో టీఈఈఏ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యం వైఫల్యం వల్లే బలిదానాలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఆ బలిదానాలు ఆగుతాయని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణపై నిర్ణయం అనుకూలంగా రావాలంటే పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అమరుల ఆశయాలను దృష్టిలో పెట్టుకుని మొక్కవోని ధైర్యంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడల్లా సీమాంధ్ర నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఇస్తే మీరు నక్సలైట్లు అవుతారు, చెడిపోతారు, దాడులు చేస్తారంటూ తెలంగాణను అనాగరికమైన సమాజంగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. సీమాంధ్ర నేతలు, మీడియా దుష్ప్రచారంవల్లే ఆత్మ బలిదానాలు జరిగాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

అమరులను ఆదుకుంటాం: శివాజీ

‘నమస్తే తెలంగాణ వెల్పేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’ ద్వారా అమరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసం తమకు ఉందని టీఈఈఏ అధ్యక్షులు శివాజీ అభివూపాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని ప్రకటించారు.

టీఈఈఏ ప్రధాన కార్యదర్శి స్వామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం రాజకీయ నేతలు ఐక్యంగా ఉద్యమించకపోవడం వల్లే వెయ్యి మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి మరణాలకు రాజకీయ నాయకులే బాధ్యత వహించాలని అన్నారు. టీఈఈఏ ముఖ్య సలహాదారులు ఎన్ జానయ్య మాట్లాడుతు సీమాంధ్ర చానళ్లు, పత్రికలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేస్తున్న విష ప్రచారంతోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. టీఈఈఏ ముఖ్య సలహాదారులు మోహన్‌డ్డి మాట్లాడుతు పదేళ్ల క్రితం విద్యుత్ సంస్థల్లో తెలంగాణ పదం ఉపయోగించడానికి సైతం భయపడాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేసుకున్నారు. విద్యుత్ సంస్థల్లో డైరక్టర్లుగా సీమాంధ్ర ప్రాంతం వారు ఉండడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కార్యక్షికమానికి సీపీడీసీఎల్ ఉపాధ్యక్షుడు రామేశ్వరయ్యశెట్టి వందన సమర్పణ చేయగా, టీఈఈఏ ప్రతినిధులు ఎంఎన్ రాజేశ్, మధుసూదన్‌డ్డి, సురేందర్‌డ్డి, భద్రయ్య, చంద్రయ్య, రాజేశ్వర్‌రావు, సురేందర్, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (నోట్: కార్యక్రమంలో ముందుగా అనుకున్న విధంగా రూ.15 లక్షల చెక్కును (ఈ మేరకు డమ్మీ కాపీ ప్రింట్ చేశారు) రిలీఫ్ సొసైటీకి అందజేశారు. అయితే… కార్యక్రమం నిర్వహణనాటికి ఆ విరాళం మొత్తం రూ. 17 లక్షలకు పెరిగింది.)

అమరుల కుటుంబసభ్యులకు సాయం

ఈ కార్యక్రమ వేదికగా ఆరుగురు అమరవీరుల కుటుంబసభ్యులకు రూ.20 వేల చొప్పున చెక్కులను అందజేశారు. హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన అమరుడు దమిశెట్టి సాయినాథ్ కుటుంబసభ్యురాలు మంగమ్మకు ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజం, టీఈఈఏ ప్రధాన కార్యదర్శి స్వామిరెడ్డి చెక్ అందజేశారు. ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన అమరుడు, ఆటోడ్రైవర్ చంద్రమౌళి కుటుంబసభ్యురాలు చంద్రకళకు కోదండరాం, టీఈఈఏ ముఖ్య సలహాదారు మోహన్‌రెడ్డి, వరంగల్‌కు చెందిన అమరుడు కొత్త మధుసూదన్ కుటుంబసభ్యురాలు కే అమ్మాయికి కిషన్‌రెడ్డి, టీఈఈఏ ముఖ్య సలహాదారు జానయ్య, నిజామాబాద్ జిల్లా దోమకొండకు చెందిన అమరుడు తెనుగు వెంకటి కుటంబసభ్యురాలు రాజమణికి కే కేశవరావు, టీఈఈఏ కార్యదర్శి బీ మధుసూదన్‌రెడ్డి, అదే జిల్లాకు మాచెర్ల మండలం ఇశాయిపేటకు చెందిన అమరుడు అయిందాల లింగయ్య భార్య లింగవ్వకు ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఈఈఏ కోశాధికారి సురేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన నీరజ్‌భరద్వాజ్ కుటుంబానికి చెక్‌ను అందించారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *