mt_logo

ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంక్షేమం కోసం కృషి చేస్తా- కేటీఆర్

తెలంగాణ భవన్ లో గురువారం ఆర్ఎంపీ, పీఎంపీ, కమ్యూనిటీ ప్యారామెడిక్స్, అనుభవ వైద్యుల అసోసియేషన్ బ్యానర్, లోగో ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. వారికి తగిన గుర్తింపు, గౌరవవేతనం లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్. వెంకట్ రెడ్డి ని కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చేవెళ్ళ పార్లమెంటు ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఇన్చార్జి కే శంకర్ గౌడ్, సంగారెడ్డి, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *