mt_logo

ఈనెల 30న గిరిజన సంక్షేమశాఖ సమీక్ష సమావేశం

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సమీక్ష సమావేశం ఈనెల 30 వ తేదీన సచివాలయంలోని డీ బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో జరగనుంది. ఈ సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ హాజరౌతారు. ఈ సంవత్సరం శాఖకు విడుదలైన నిధులు, పథకాలకు చేసిన ఖర్చు, ఇతర నాన్ ప్లాన్ ఖర్చు, 2014-15 సం.లో ట్రైబల్ సబ్ ప్లాన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికలను గిరిజన సంక్షేమ శాఖామంత్రికి అందజేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *