mt_logo

తెలంగాణ అంటే ఆది నుండీ అదే చిన్నచూపు

ఈ ఆర్టికల్ ముందు భాగం ఇక్కడ చదవండి  – తెలుగు సినిమాకున్న రోగం కొత్తదీ కాదు… మానేదీ కాదు

By: సవాల్ రెడ్డి 

 

తెలంగాణ అంటే కేవలం సినిమా వాళ్లకే కాదు అక్కడి సాహితీవేత్తలు, రాజకీయ నాయకులకు కూడా అలుసే. స్వాతంత్ర్యానికి పూర్వంనుంచి ఈ రోజు వరకూ తెలంగాణపై వారి అభిప్రాయాల్లో కొన్ని ఇవి:

1947కి పూర్వం:

ముడుంబై రాఘవాచార్యులు: తెలంగాణలో కవులు పూజ్యం. అక్కడ కవిత్వం వచ్చినవాళ్లు లేరు.

రాయప్రోలు: మీది బజారు భాష.. అది తెలుగే కాదు. (తెలంగాణ సొమ్ముతో ఏర్పాటైన యూనివర్సిటీలో పనిచేసి పొట్టపోసుకుంటున్న సమయంలో.)

అయ్యదేవర కాళేశ్వర రావు: మిమ్మల్నీ, మీ భాషను ఉద్దరిస్తాం. తెలంగాణ భాషను సంస్కరించడానికే విశాలాంధ్ర (వరంగల్ విశాలాంధ్ర సభలో. జయశంకర్ నాయకత్వంలో ఇక్కడే గొడవ జరిగింది)

1970:

జంధ్యాల పాపయ్య శాస్త్రి: తెలంగాణ ఏర్పడితే దక్షిణ పాకిస్తాన్ అవుతుంది. తెలుగు భాషను భ్రష్టుపట్టిస్తున్నారు తురకల భాష మీది. తౌరక్యాంధ్రం

1972:

వెంకయ్యనాయుడు: అక్కడంతా అడవి మనుషులు.వాళ్లతో కలిసి ఉండేది లేదు. ( జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా గుంటూరు సభలో)

గౌతు లచ్చన్న: హైదరాబాద్ అద్దెకొంప.. అక్కడెందుకు ఉంటాం. (విజయవాడ జై ఆంధ్ర సభలో)

రంగా: ఆంధ్రులు విజృంభిస్తే “ఎవడాపుతాడు?”

2005-12:

రాయపాటి: తెలంగాణ వాళ్లకు చదువే రాదు.ఉద్యోగాలెలా వస్తాయి (గ్రూప్ 1 ఇంటర్వ్యూల వివాదం రేగిన సమయంలో)

రఘువీరా రెడ్డి: తెలంగాణా. నా తలకాయా.

మారెప్ప: తెలంగాణ… బిచ్చగాడి చేతిలో భగవద్గీత.

తెలంగాణ అంటే అదేమన్నా బీడీనామ్మా.. అడగ్గానే ఇవ్వడానికి.

దివాకర్ రెడ్డి: వైఎస్ ఆంధ్ర ,తెలంగాణలను రెండుకళ్లలా చూడమన్నాడు..(వెకిలినవ్వు) నాకు ఒక కన్ను చూపు ఆనదు మరి…(మెంటికన్ను గీటుతూ)

కావూరి: ఉస్మానియాలో భింద్రన్వాలాలున్నారు.

లగడపాటి: తెలంగాణ వాదులు తాలిబన్లు. ఉస్మానియావర్సిటీ ఎత్తేయాలి.

పయ్యావుల కేశవ్: తెలంగాణ అంటే మేం ఆత్మాహుతిదళాలమవుతాం

ఏబికె: మైసూరులోని తెలుగు పీఠం హైదరాబాద్ కు తరలించవచ్చు అయితే ఇక్కడి ఫుండాకోర్లు దాన్ని ధ్వంసం చేస్తారేమో?

ఉండవల్లి: తెలంగాణ నాయకులు ఖాసీంరజ్వీ వారసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *