ఇప్పుడు రాష్ట్రంలో చర్చ అంతా అటూ ఇటూ కాకుండా పోయిన పది మంది ఎమ్మెల్యేల గురించే. డబ్బుకు, పదవులకు, పైరవీలకు ఆశపడి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు న ఘర్ కా, న ఘాట్ కా అన్నట్టు అయ్యింది.
గత వారం ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే అని హైకోర్టు కరాకండిగా చెప్పడంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. ఇన్నాళ్లూ తమను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ ఇష్టారీతిన ఫిరాయింపులను ప్రోత్సాహించిన రేవంత్ గ్యాంగ్‌కు, వలస ఎమ్మెల్యేలకు దెబ్బకు దెయ్యం దిగింది.
హైకోర్టు ఇచ్చిన షాక్‌కు రేవంత్ రెడ్డి, అతని మంత్రులు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ గజినీల్లాగా నటిస్తున్నారు. అబ్బే మేం పార్టీ మారలేదు అనీ అరికపూడి గాడ్సే వంటి ఎమ్మెల్యేలు అంటుండగా, అసలు కాంగ్రెస్‌లో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరలేదు అని రేవంత్, అతని సహచర మంత్రులు కామెడీ పండిస్తున్నారు.
వీళ్ల వీర కామెడీ యాక్టింగ్‌కు భాస్కర్ అవార్డులు ఇవ్వాల్సిందే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెత్తగా చురకలు అంటిస్తున్నారు.
రావాల్సిన డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఏమీ రాకపోగా, ఉల్టా ఉన్న ఎమ్మెల్యే పదవి పీకేటట్టుంది అని వలస ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారు ఇప్పుడు. అరికెపూడి గాడ్సే బాధైతే వర్ణనాతీతం. మొన్న రేవంత్ సూచనలతో రెచ్చిపోయి పాడి కౌషిక్ రెడ్డి ఇంటిమీదికి పోయి దాడి చేస్తే, అది కాస్తా వికటించి పెద్ద వివాదం అయ్యింది. దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటించడమే కాక, పోలీస్ అధికారులు కాంగ్రెస్ గూండాలతో కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు చేయడంతో ఉలిక్కిపడ్డ రేవంత్ సర్కార్ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది.
దానిలో భాగంగా ఏకంగా అరికెపూడి మీద, అతని అనుచరుల మీద హత్యాప్రయత్నం కేసు పెట్టింది. పార్టీ మారి, ఎమ్మెల్యే పదవికి గండం వచ్చి, ఇజ్జత్ అంతా పోయి, ఇప్పుడు హత్యాయత్నం వంటి సీరియస్ కేసులో ఇరుక్కోవడంతో అరికపూడి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
రేవంత్ రెడ్డి లాంటోడిని నమ్మడమే మేము చేసిన తప్పు.. నమ్మించి మా గొంతు కోసాడు అని వలస ఎమ్మెల్యేలంతా కలిసినోళ్లకు చెప్పుకుని కుమిలిపోతున్నారట!