తెలంగాణలో బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ హెచ్చరించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ తెలంగాణపై కక్ష్య పెంచుకున్నదని, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నదని ఆయన ఆగహ్రం వ్యక్తంచేశారు. ఢిల్లీ నుంచి వచ్చే దూతలు ఇక్కడి బీజేపీ నాయకులను ఆడిస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని, రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్ల వచ్చిందని చెప్పారు. రాజగోపాల్ బీజేపీ చేతిలో పావుగా మారాడన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీకి బుద్ధిచెబుతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీకి అధికార యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టారు. ఈ నెల 20న మునుగోడులో జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
- Congress government mulling over cutting down Rythu Bharosa beneficiaries
- Anganwadis suffering due to Congress government’s gross negligence
- Corruption became rampant in Telangana under Congress rule: Survey
- 1 cr acres of agricultural land at risk of losing Rythu Bharosa?
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి: కవిత
- ఆరు గ్యారెంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు: కేటీఆర్
- తెలంగాణలో నడుస్తున్నది ఇందిరమ్మ రాజ్యమా లేక పోలీస్ రాజ్యమా?: హరీష్ రావు
- బీసీలకు 42% రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము: కవిత
- భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్ బెనెగల్ తెలంగాణకు గర్వకారణం: కేసీఆర్
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్