mt_logo

తెలంగాణలో చిచ్చుకు అమరావతిలో కుట్ర

– ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పథక రచన
– డీ గ్రేడ్ నాయకులతో బాబు గంటల తరబడి మంతనాలు
– కేసీఆర్ ను బద్‌నాం చేసే ఎత్తుగడలు
– ఫైనాన్స్ బాధ్యత ఆంధ్ర కీలక నేతకు
– సమన్వయం చేయనున్న రేవంత్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా అప్రతిష్ట పాలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కంటున్నారా? ఇందుకోసం స్పాన్సర్డ్ ఉద్యమాలకు తెరతీస్తున్నారా? తెలంగాణలో ఎవరూ పట్టించుకోని డీ గ్రేడ్ నేతలను ఇందుకు ఉసిగొల్పుతున్నారా? పొరుగు రాష్ట్రాన్ని ఉద్ధరించే పనిలో బిజీగా ఉన్నట్టు ఫోజులు కొట్టే బాబు అలాంటి నేతలతో గంటల తరబడి సంప్రదింపులు జరుపుతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినవస్తోంది. తెలంగాణ నుంచి నిష్క్రమణకు కారణమైన సీఎం కేసీఆర్ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని బాబు కుతకుతలాడిపోతున్నారట. తనను ప్రజల ముందు దోషిగా నిలిపిన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ను అస్థిర పరచడానికి ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం ఆర్థిక పరిపుట్టినిచ్చే బాధ్యతను ఏపీ కీలక నేతకు అప్పగించిన బాబు, స్పాన్సర్డ్ ఉద్యమాలను కో ఆర్డినేట్ చేసే మహత్తర అవకాశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ పని కూడా షురూవయ్యింది. ఇక చూడండి ముందు ముందు ఎలాంటి దిగజారుడు ప్రయత్నాలను చూడాల్సి వస్తుందో. గెలుపు అసాధ్యమని తెలిసీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ శాసన సభ్యులను కొనుగోలుకు యత్నించింది. ఈ క్రమంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో భేరసారాలు నెరిపింది.

అధికార పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకుని వారితోనూ మంతనాలను సాగించింది. ఓటుకు కోట్లు వ్యవహారం కనుక బయటికి రాకుంటే టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డి శాసన మండలిలో కాలు మోపేవారు. అదే సమయంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడేది. ఒకనాటి సహచరుడైన చంద్రబాబు కుయుక్తులు, వాటి అనుపానులు ఆసాంతం ఎరిగిన కేసీఆర్ ఎడమ కన్ను ఎందుకు అదిరింది. టీడీపీ వ్యవహారాలపై ఓ లుక్కేయడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేందుకు బాబు పన్నగాలు తేటతెల్లమయ్యాయి. కేసీఆర్ అలర్ట్ అయ్యాడు. ఏసీబీని రంగంలోకి దించాడు. తెరవెనుక పావులు చకచక కదిలాయి. రేవంత్ రెడ్డి డబ్బు సంచితో స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అనేక కుంభకోణాల్లో కోర్టును మేనేజ్ చేసి దర్జాగా తిరుగుతున్న చంద్రబాబు మొట్టమొదటిసారిగా ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు. తాను ఎంతో కాలంగా కవర్ చేసుకుంటూ వస్తున్న పరువు గంగలో కలిసిపోయింది. టీడీపీ దొంగల పార్టీగా ముద్రపడిపోయింది. ఇప్పటికిప్పుడు తెలంగాణ సమాజం మదిలోంచి నోటుకు కోట్లు కేసు తొలగిపోవడం అసాధ్యం. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ పార్టీకి ఇంకా ఇక్కడ చోటు ఉంటుంది అనుకోవడం అవివేకమే.

అయినా సరే బాబు ఇక్కడ పోయిన ప్రభావాన్ని తిరిగి తెచ్చుకునేందుకు పాకులాడుతున్నాడు. అందుకు అధికార పక్షాన్ని మస్తు మస్తుగా తిట్టించి పలుచన పరిచే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఇందుకోసం ఆయన కొందరు తెలంగాణ ప్రాంత వాసులను ఎంపిక చేసుకున్నారు. వివిధ సంస్థలు, సంఘాల్లో ఎక్కడో ఓ మూలాన ఉండిపోయే వారిలో కాస్త నోరున్న వారిని ఇప్పటికే గుర్తించారు తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు. వారితో స్వయంగా చంద్రబాబు సమావేశమయ్యారట. నవ్యాంద్రను సింగపూరో, మరేదో చేసే పనిలో బీజీగా ఉన్నట్లు కలర్ ఇచ్చే సదరు బాబు డీ గ్రేడ్ నాయకులతో గంటల తరబడి భేటి కావడం గమనార్హం. వారికి కర్తవ్య బోద చేసిన బాబు… కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ భాషలో తిట్టాలి…ఆ తిట్లు ఎన్ని డిగ్రీల కోణంలో ఉండాలో ధర్మోపదేశం చేశారట. డబ్బు దర్జాలకు ఢోకా ఉండబోదని భరోసా ఇచ్చిన బాబు…ఫైనాన్స్ చేసే బాధ్యతను కీలక ఆంధ్ర నేతకు అప్పగించాడు. తిట్ల దండకాన్ని అందుకునే వారిలో కో ఆర్డినేట్ చేసే మహత్తర బాధ్యతను తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డికి అప్పగించేశారు. ఇప్పుడు సదరు డీ గ్రేడ్ నేతలకు ప్రత్యేక బూతు క్లాసులు నిర్వహించడానికి అన్ని ఎర్పాట్లు చేస్తున్నారట. ఆంధ్ర వలస నేతల కుంట్రల వలను విసిరేందుకు వారంతా రెడీ అవుతున్నారు. ఉగాది తర్వాత అసలు సిన్మా మొదలు కానుందట.

తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆవిర్భావం తర్వాత చంద్రబాబు అనేక పర్యాయాలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను, అవసరాన్ని అపహాస్యం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపైనా అవకాశం దొరికిన ప్రతిసారి అవాకులు చెవాకులు పేలడం ఆయనకు అలవాటే. మొన్నటికి మొన్న కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి తెలంగాణ సమాజం నుంచి చీవాట్లు తిన్నాడు. అయినా ఇటువంటి పరిస్థితుల్లో లేశమంతైనా మార్పులేదు. బాబు అంతే డిఫాల్టర్లను వెనుకేసుకుని తిరగడం… వారినే అందంలం ఎక్కించడం… హైదరాబాద్ అభివృద్ధిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం. అలాంటి బాబు విసిరే ముష్టికి ఆశపడి తెలంగాణ వాసులే స్వరాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని, వీలైనంత ఎక్కువగా తిట్టాలని ప్రయత్నించడం వలసవాద నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. నిజగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ తప్పు చేస్తే అతడిని తెలంగాన పౌర సమాజం వెనుకేసుకేమీ రాదు. సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ధి చెప్పి తీరుతుంది. ఇందులో ఎవరికి ఎలాంటి అపోహాలు అవసరం లేదు. చంద్రబాబు కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై స్వయంగానే అక్కసు వెళ్లగక్కిన సందర‌్భాలూ ఉన్నాయి. మోత్కుపల్లి నర్సింహులుకు ఏ పదవీ దక్కక ఇక నోరు మెదపడం లేదు. రేవంత్ ఎంత తిట్టినా అది కేసీఆర్ కే మైలేజ్ ఇస్తుంది. కానీ టీడీపీ గ్రాఫ్ మాత్రం పాయింట్ జీరో వన్ స్థాయికైనా పైకి ఎదడగం లేదు. ఇంతటీ అభద్రతలో బాబుకు తెలంగాణనోని డీ గ్రేడ్ నేతలు కల్పతరువులా కనిపించారు. రాజధాని, పట్టిసీమ ప్రవాహంలో కొట్టుకువచ్చిన అవినీతి సొమ్ము ముక్తి మూల్గుతోంది. ఇంకేం రంగంలోకి దిగాడు. తెలంగాణ ప్రజలారా బీ అలర్ట్. మన నాశనాన్ని మనమే కోరుకోకుండా, బాబు పన్నాగాలను తిప్పికొట్టి, బంగారు తెలంగాణలో భాగస్వాములం కావాలని కోరుకుందాం..!

Source: Janam Sakshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *