మాజీ మంత్రి హరీష్ రావు పెట్టిన 24 గంటల డెడ్‌లైన్‌క కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెళ్లికి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది.
24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీరు విడుదల చేయకుంటే.. మల్లన్న సాగర్‌ను ముట్టడి చేసి మల్లన్న సాగర్ గేట్లను తెరుస్తాం అని ఈరోజు ఉదయం హరీష్ రావు హెచ్చరించారు. తక్షణం కాలువలు, చెరువుల కింద ఉన్న పంటలకు నీటిని విడుదల చేయాలని.. ఇంకా 2-3 తడులకు నీళ్లు అందిస్తే రైతులకు ఉపయోగం ఉంటుందని సూచించారు.
హరీష్ రావు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. తమ పంటల కాపాడటం కోసం పోరాడిన హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి రైతులు ధన్యవాదాలు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్ర్పచారం చేస్తున్నప్పటికి కష్టకాలంలో ఆ ప్రాజెక్టే రైతులకు ఉపయోగపడిందని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేశారు.