మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఈసారి టిక్కెట్ ఇవ్వదని తెలియడంతో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఒకట్రెండు రోజుల్లో రాజేందర్ పార్టీ మారనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మరికొందరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత టిక్కెట్ లభించని మరికొందరు టీఆర్ఎస్ లో చేరుతారని టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.