అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని.. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది అని అన్నారు.
వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు అని గుర్తు చేశారు.
రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలి అని హరీష్ రావు పేర్కొన్నారు.
జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను మంత్రులు ఈరోజు పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలకేంద్రంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. హరీష్ రావు వెంట చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్కసుమన్ తదితరులు ఉన్నారు. మరోవైపు జగిత్యాల మండలం నర్సింగాపూర్ లో మంత్రులు…
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించింది. అలాగే జిల్లాల వారీగా, పంటల వారీగా జరిగిన నష్టాలను సమగ్రంగా అంచనా వేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఆకస్మిక వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించి... ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు…
సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను, పశువులు కోల్పోయిన వారిని, ఇళ్ళను కోల్పోయిన వారిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని, అంతేకాకుండా పిడుగుపాటు, వడగండ్లు, భారీ వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్ధికసాయం…