mt_logo

దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన స్మితా సబర్వాల్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి, నీటిపారుదల శాఖ బాధ్యులు స్మితా సబర్వాల్ ఈరోజు ములుగు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల ఇన్ టేక్ వెల్ ప్రధాన బ్యారేజీ పనులతో పాటు రంగాయి చెరువు ప్రాజెక్ట్ పంప్ హౌజ్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.

ములుగు సమీపంలోని రంగారావుపల్లి వద్ద నిర్మిస్తున్న దేవాదుల పంప్ హౌజ్ ప్యాకేజ్-5, పాకాల, రామప్ప ప్యాకేజీ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామానికి చేరుకొని ప్యాకేజీ రెండవ పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిపై స్మితా సబర్వాల్ కు పూర్తి సమాచారం అందించారు. ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ బంగారయ్య దేవాదుల ఇన్ టేక్ వెల్ పనుల పురోగతి, చేపడుతున్న విధివిధానాలను ఆమెకు వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *