mt_logo

స్మార్ట్ అంగన్‌వాడీలు..

అంగన్‌వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకురానుంది. కేంద్రాల్లో సరుకుల పంపిణీలో లోపాలు లేకుండా ఉండేందుకు ఆన్ లైన్ విధానం అమలుచేయనుంది. ఈమేరకు అంగన్‌వాడీ సూపర్ వైజర్లకు ట్యాబ్ లు, టీచర్లకు స్మార్ట్ ఫోన్ లు అందించనుంది. ఈ విధానం వచ్చే నెలనుండి అమల్లోకి వస్తుంది. విద్యార్ధుల హాజరు మొదలు పంపిణీ చేసే సరుకుల వరకు అన్ని వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీలకు అందించే ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు కామన్ అప్లికేషన్ సిస్టం(సీఏఎస్) అనే ప్రత్యేక యాప్ తో అనుసంధానం చేయనున్నారు. రోజువారీగా బాలబాలికలు, గర్భిణులకు అందించే పౌష్టికాహార పదార్ధాలను సీఏఎస్ ద్వారా నమోదుచేసి పంపిణీ చేస్తారు. సీఏఎస్ లోనే అటెండెన్స్, పోషక పదార్ధాలను పంపిణీ వంటి అప్లికేషన్లు ఉంటాయి. వీటిని తమ వద్ద ఉన్న ఫోన్లలో నమోదు చేస్తే సరిపోతుంది. ఏ రోజు ఎంతమంది సెంటర్ కు హాజరయ్యారు? ఎన్ని కోడిగుడ్లు, బియ్యం, బాలామృతం పంపిణీ చేశారు? అనే అంశాలు తెలిసిపోతాయి. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా లబ్దిదారులకు కోడిగుడ్లు, బియ్యం, బాలామృతం వంటి పోషకాహార పదార్ధాలు పంపిణీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *