mt_logo

సీఎం తీర్మానం చెల్లదు-జైపాల్ రెడ్డి

సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం నాటకీయ పరిణామాలను తలపిస్తున్నదని, ఆ రోజే తీర్మానం ప్రవేశపెట్టడం, వెంటనే స్పీకర్ దానిని మూజువాణి ఓటుతో ఆమోదించడం తొండి చేష్టలుగా కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అభివర్ణించారు. ఈ చర్యల వల్ల అసెంబ్లీ ప్రతిష్ఠ దిగజారిందని విమర్శించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపరని, రాష్ట్ర ప్రభుత్వానికే అది చెందుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి కుటిల ప్రయత్నాలు మానుకోవాలని, ఏరకంగానూ పార్లమెంటును ఇలాంటి తీర్మానాలు ప్రభావితం చేయవని వివరించారు. అత్యంత కీలకమైన రాష్ట్ర విభజన బిల్లును మూజువాణి ఓటుతో తిరస్కరించడం సరైందికాదని, సీఎం పదవి రాజ్యాంగబద్దమైనదని, కేబినెట్ అభిప్రాయాలు కూడా తీసుకోవాలని లేని పక్షంలో అది సీఎం వ్యక్తిగత నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరుగుతుందని, ఫిబ్రవరి 3వ వారంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్రంతో పాటు ప్రభుత్వ ఏర్పాటు కూడా జరిగిపోతుందని స్పష్టం చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని జైపాల్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *