mt_logo

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం : సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఏర్పాటు చేసుకొని.. జిల్లా పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకొని ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల కలిగిన శుభపరిణామం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరిగే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలుగా చేస్తే భవిష్యత్‌లో బాగుంటుందని పెద్దలు చెప్పడం, ప్రజాప్రతినిధులు, మంత్రులు కోరడం.. జనాభాను పరిశీలించినప్పుడు చాలా పెద్ద జిల్లాగా ఉండడం, పరిపాలన సౌలభ్యం గొప్పగా ఉండాలంటే, ప్రజలకు అన్నీ మంచి పనులు నెరవేరాలంటే తప్పకుండా మేడ్చల్‌ జిల్లా కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అందులో భాగంగానే 33 జిల్లాలు వచ్చినయ్‌. రైతులు వేదికలు ఏర్పాటు చేయాలంటే మన రాష్ట్రంలో మన వ్యవసాయ భూమిని ప్రతి 5వేల ఎకరాలకు క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, ఒక్కో వ్యవసాయాధికారిని నియమించాం. 2601 క్లస్టర్లు అయ్యాయి. వాటన్నింటికి కూడా పేరుకే రైతులు కానీ.. కూర్చుకునేందుకు వేదిక లేదని చెప్పి.. ఆరేడు నెలల్లో నిర్మించాం. పరిపాలన వికేంద్రీకరణ జరిగిందింది కాబట్టి.. అంత సులభంగా భవనాలు కట్టుకోగలిగాం. రాష్ట్రంలో ఇప్పటికే 11వేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకాబోతున్నాయి. రాష్ట్రంలో తీసుకున్న కార్యక్రమాల ప్రజలకు చకాచకా ప్రజలకు వేగంగా అందుతున్నయ్‌. ఇవాళ మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు.. దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు అద్భుతంగా ఈ రోజు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దళారీల ప్రమేయం లేకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఠంచన్‌గా వారందరికీ అందుతున్నయ్‌.

రాష్ట్రంలో 36లక్షల పెన్షన్లు ఉన్నయ్‌. మరో 10లక్షల పెన్షన్లు ఆగస్టు 15 నుంచి పంచుతున్నం. కరోనాతో కొంత ఆలస్యమైంది. 57 సంవత్సరాల వారికి ఇస్తామని చెప్పాం. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తికమక అయిన పరిస్థితుల్లో కొంత ఆలస్యమైంది. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటే 46లక్షలకు పెన్షన్లు చేరుకుంటున్నయ్‌. ఈ 46లక్షల పెన్షన్‌దారులకు అద్భుతమైన కొత్త కార్డులు ఎలక్ట్రానిక్‌ బార్‌కోడ్లతో పంపిణీ చేస్తున్నారు. రాబోయే వారం పదిరోజుల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని’ సీఎం కేసీఆర్‌ కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *