తెలంగాణ రాష్ట్రంలోని వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం ఈరోజు సంతకం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు త్వరగా అందేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలకు సీఎం సూచించారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డుల ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్ కు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి జర్నలిస్టులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వీరికి హెల్త్ కార్డులు అందించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.