రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

  • August 11, 2022 2:54 pm

మానవ సంబంధాల్లోని పవిత్రమైన సోదరీసోదరుల బంధాన్ని దృఢ పరిచే రాఖీల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా ఉంటారని, ప్రేమను పంచుతారనే భరోసా రాఖీ పండుగలో ఇమిడి ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.


Connect with us

Videos

MORE